: విశాఖ హెచ్ పీసీఎల్ అగ్ని ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమం


విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ (హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్)లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇరవై మంది క్షతగాత్రులను కేజీహెచ్ కు, ముప్పై మందిని ఐఎన్ఎన్ కల్యాణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ముగ్గురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. కూలింగ్ టవర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో, నిర్మాణంలో ఉన్న బ్లాక్ లో మంటలు ఎగసి పడుతుండటంతో ఆగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు దట్టంగా అలముకోవడంతో పొగలు కమ్ముకున్నాయి.

  • Loading...

More Telugu News