: హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో పురోగతి


అగస్టా వెస్ఠ్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న సీబీఐ బృందం హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను సేకరించింది. మిలన్ నగరంలోని ఇటలీ అధికార వర్గాలు ఈ పత్రాలను సీబీఐకి అందజేశాయి. దీంతో, ఈ ఒప్పందంలో భారతీయులెవరైనా ముడుపులు అందుకున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

  • Loading...

More Telugu News