: పాక్ జైలు నుంచి 337 మంది భారతీయ ఖైదీలకు స్వేచ్ఛ


పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న 337 మంది భారతీయ ఖైదీలను ఆ దేశం విడుదల చేసింది. ఇందులో ఎనిమిది మంది బాలనేరస్థులు కూడా ఉన్నారని దక్షిణ సింద్ అధికారిక హోంశాఖ తెలిపింది. వారిలో చాలామంది మత్స్యకారులు ఉన్నారని, అందరూ కరాచీలోని మాలిర్ జిల్లా జైలు నుంచి విడుదలైనట్లు చెప్పింది. అయితే, జాతీయతకు సంబంధించి అనుమానాలు ఉండటంతో ఓ భారతీయ ఖైదీ విడుదల కాలేదని జైలు సూపరింటెండెంట్ షుజ హైదర్ వెల్లడించారు. విడుదలైన వారిని బస్సులలో తీసుకువెళ్లి వాఘా సరిహద్దు వద్ద రేపు భారతీయ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు పాక్ సైన్యం తాజాగా కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో ఖైదీలను విడుదల చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News