: కేంద్రం చోద్యం చూస్తోంది: సుజనా చౌదరి
సీమాంధ్ర రావణకాష్టంలా మండుతోందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ అన్ని సేవలు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా సంఘాలన్నీ విధులను బహిష్కరించి రోడ్లపై ఆందోళనలు చేస్తున్నాయని రాజ్యసభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ వ్యవస్థలు పని చేయడం లేదని సభకు తెలిపారు. కోట్లాది మంది ప్రజలు ప్రతి గ్రామంలోనూ దీక్షలు చేపట్టి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు కిమ్మనడం లేదని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. నిద్రపోతున్న వారిని లేపవచ్చు, కానీ నిద్ర పోతున్నట్టు నటించే వారిని ఏం చేయలేమని టీడీపీ ఎంపీ సుజనా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూలనాడారు.