: కొనసాగుతున్న టీడీపీ నేత రామానాయుడు దీక్ష
ఆరోగ్యం సహకరించకున్నా విశాఖపట్నంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన నిరవధిక దీక్ష కొనసాగుతూనే ఉంది. నేటితో దీక్ష ఆరో రోజుకు చేరింది. రామానాయుడు కామెర్లతో బాధపడుతుండటంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అయినా విశాఖలోని పార్టీ కార్యాలయంలోనే ఆయన, మరోనాయకుడు అమర్ నాథ్ దీక్ష చేస్తున్నారు.