: ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం


లోక్ సభ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. ప్రధానంగా ఈ భేటీలో లోక్ సభ సజావుగా జరిగేందుకు అనుసరించాల్సిన విధానాలు, సభ్యులను శాంతింపజేసేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చ జరగనుందని తెలుస్తోంది. అటు ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో లోక్ సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News