: వీడో జనమేజయుడు
పురాతన కాలంలో జనమేజయుడు సర్పయాగాన్ని చేసి బోలెడు పాముల్ని చంపేందుకు ప్రయత్నించాడని మనం విన్నాం. అయితే ఈ కాలంలో పచ్చి పాములనే ఫలహారం కానిచ్చేస్తున్నాడు ఈ బీహారోడు. మనకు తెలిసినంతమేర కొన్ని దేశాల్లో పాములను చక్కగా వండుకుని తింటారని మనం విన్నాం. కానీ పచ్చి పాములను చక్కగా పట్టుకుని పరపరా నమిలి తినేసే వాళ్లను ఎక్కడా చూడలేదు. నిరంజన్ భాస్కర్ ఇలాంటి కోవకు చెందిన వాడే.
బీహార్‌కు చెందిన నిరంజన్ భాస్కర్ అనే వ్యక్తి రోజుకు కనీసం ఒక్క పామైనా లేకుండా తన భోజనం పూర్తికాదని చెబుతున్నాడు. బీహార్‌లోని అరాహ్ జిల్లాకు చెందిన నిరంజన్ భాస్కర్ తాను ఏడేళ్ల వయసున్నప్పుడు 1977లో వర్షాకాలంలో బడికి వెళుతుండగా తనపైకి ఒక పాము దాడి చేసిందని తప్పించుకునే మార్గం లేకపోవడంతో తాను కోపంతో ఆ పామును పట్టుకుని కసితీరా కొరికేశానని, అలా కొరుకుతూ కొరుకుతూ మొత్తం పామును తినేశానని అప్పటి జ్ఞాపకాన్ని నిరంజన్ గుర్తు చేసుకున్నాడు. ఇక అప్పటినుండి రోజుకు ఒక్క పామునైనా తినకుండా ఉండలేకపోతున్నానని చెప్పాడు. ఇప్పటి వరకూ దాదాపుగా నాలుగు వేలకు పైగా పాములను తినేశానని, ఇలా పాములను హరాయించేసిన తన ఘనతను గిన్నిస్ బుక్ వారు గుర్తించాలని చెబుతున్నాడు.