: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
శని, ఆదివారాల్లో కిటకిటలాడిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో ఈరోజు సాధారణ రద్దీ నెలకొంది. ఇప్పటివరకు కేవలం 13 కంపార్ట్ మెంట్లు మాత్రమే నిండాయి. స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. ఇక కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.