: సీమాంధ్ర ఉద్యమం వల్ల ఉపయోగం లేదు: హరీష్ రావు
సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం వల్ల ఉపయోగం లేదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పార్టీ భవన్లో ఆయన మాట్లాడుతూ యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. అలాంటి తరుణంలో సీమాంధ్రుల ఆందోళనలు, ఉద్యోగుల సమ్మెతో ఒరిగేదేమీ ఉండదన్నారు. ఇక మిగిలింది ప్రత్యేక రాష్ట్రమేనని ఆయన తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని హరీష్ రావు పునరుద్ఘాటించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.