: నెట్ వాడకంలో జపాన్ ను దాటేసిన భారత్
నెట్ వాడకంలో మనం జపాన్ ను దాటేశాం. ఇంతకీ మన దేశంలో నెట్ వాడకందారులు ఎంత మందో మీకు తెలుసా? అక్షరాలా ఏడు కోట్ల నలభై లక్షల మంది! సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న జపాన్ ను దాటుకుని ముందుకెళ్లడంతో ఈ రేసులో మనకంటే ముందు అమెరికా, చైనాలు ఉన్నాయి. అంటే నెట్ వాడకంలో భారత దేశం మూడో స్థానంలో ఉంది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకంతో సోషల్ మీడియా, వార్తాపత్రికలు వంటి వాటికోసం ఎక్కువ మంది నెట్ వాడుతున్నారు. దీంతో ఏటా 31 శాతం పెరుగుదలతో మన దేశంలో నెట్ వినియోగదారులు 7. 4 కోట్లకు చేరుకున్నారు. అదే జపాన్ లో 1.76 కోట్ల మంది మాత్రమే నెట్ వినియోగదారులున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో తొలిస్థానంలో చైనా ఉండగా ద్వితీయస్థానంలో భారత్, తృతీయ స్థానంలో జపాన్ ఉన్నాయి.