: హజ్ భవన్ ముందు మైనారిటీ విద్యార్ధుల ధర్నా
మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్పులు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం హైదరాబాద్ లోని నాంపల్లిలోని హజ్ భవన్ ముందు ధర్నాకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లిన విద్యార్ధి నేతలు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ లేకపోవడంతో జనరల్ మేనేజర్ ను నిలదీశారు. స్కాలర్ షిప్ లు సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారని విద్యార్ధి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు వచ్చినప్పటికీ విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటున్న కిరణ్ సర్కారు తక్షణమే స్కాలర్ షిప్ లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.