: శాంతి ర్యాలీకి అనుమతి కోరిన ఓయూ జేఏసీ
సెప్టెంబర్ 7 న శాంతి ర్యాలీకి అనుమతినివ్వాలని ఓయూ జేఏసీ సెంట్రల్ జోన్ డీసీపీకి వినతి పత్రం సమర్పించింది. నిజాం కళాశాల నుంచి శాంతి ర్యాలీకి అనుమతి నివ్వాలని డీసీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొంది. అదే రోజు సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవొలు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఒకరికి అనుమతినిచ్చి మరొకరికి అనుమతి నిరాకరిస్తే వివాదమవుతుంది. దాన్ని కూడా ప్రాంతీయవాదంతో ముడిపెట్టే అవకాశముంది. దీంతో రెండు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.