: ఆస్కార్ ఖాతా తెరిచిన 'లింకన్'
ఎన్నో అంచనాలతో నామినేషన్లు పొందిన 'లింకన్' సినిమా ఆస్కార్ రేసులో ఖాతా తెరిచింది. కాగా ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును ఈ చిత్రం గెలుచుకుంది. 'లైఫ్ ఆఫ్ పై' ఇప్పటికే రెండు విభాగాలలో అవార్డులు గెలుచుకోగా, ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ పురస్కారాన్ని విలియం గోల్డెన్ బెర్గ్ (చిత్రం: ఆర్గో), ఉత్తమ సహాయనటి అవార్డును ఏనే హేత్వే (చిత్రం: లెస్ మిజరబుల్స్) గెలుచుకున్నారు.
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ అవార్డు విషయంలో నువ్వా? నేనా? అన్న పోటీ ఏర్పడడంతో 'జీరో డార్క్ థర్టీ', 'స్కై ఫాల్' చిత్రాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. అవార్డుల వేడుక కొనసాగుతోంది.