: రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వద్ద ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి చెందారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నలుగురు యువకులు బీటెక్ చదువుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఈ ఉదయం కళాశాలకు బయలుదేరగా, నారాకోడూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సిటీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నాలుగో విద్యార్ధిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గోపీకృష్ణ, రామకృష్ణ, భార్గవ్, షేక్ బాషాగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.