: ముఖ్యమంత్రితో భేటీ అయిన ఏపీఎన్జీవోలు
ఏపీఎన్జీవో ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఉద్యోగులు ఉద్యమాన్ని వీడాలని, అధిష్ఠానానికి అన్నీ విన్నవించామని సీఎం తెలపగా, సీమాంధ్ర ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఏపీఎన్జీవోలు తెలిపారు. హైకోర్టు కూడా సమ్మెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని, అందువల్ల సమ్మెను విరమించాలని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమ ప్రాంతంలో ఉద్యమం మరింత ఉద్ధృతం అయిందని, హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించనున్నామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు ఏపీఎన్జీవో ప్రతినిధులు. మరిన్ని అంశాలపై ముఖ్యమంత్రితో వారు చర్చించారు.