: మాపై సస్పెన్షన్ తీర్మానం అన్యాయం: టీడీపీ ఎంపీలు
తమను సస్పెండ్ చేయాలంటూ లోక్ సభలో తీర్మానం చేయడం అన్యాయమని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో వారు మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేవరకు పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు. తమ సస్పెన్షన్ ప్రతిపాదనను అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. విభజనపై పూర్తి స్థాయి చర్చ జరిగిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మోసాలు, కుతంత్రాలతో ఎంతో కాలం కాంగ్రెస్ పాలన కొనసాగదించలేదని వారు తెలిపారు. కావాలంటే సీమాంద్ర ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడి పరిస్థితులను తాను చూపిస్తానని ఎంపీ శివప్రసాద్ మాటిచ్చారు.