: సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ పోటాపోటీ నిరసనలు
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నిరసన కార్యక్రమాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత 22 రోజులుగా నిరసనలు చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీరికి ప్రతిగా శాంతి ర్యాలీ పేరుతో తెలంగాణ ఉద్యోగులు నిరసన ప్రారంభించారు.