: సాక్షిగా కోర్టు విచారణకు వచ్చిన అనిల్ అంబానీ


2జీ స్పెక్ట్రం కేసులో రిలయన్స్ ఏడీఏ గ్రూపు అధినేత అనిల్ అంబానీ ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలంటూ కోర్టు సమన్లు జారీ చేయడంతో ఆయన వచ్చారు. విచారణకు తనను హాజరు కావాలని కోరడంపై అనిల్ అంబానీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, అనిల్ పిటిషన్ పై వెంటనే వాదనలు వినడానికి కోర్టు అంగీకరించలేదు. దీంతో అనిల్ ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.

2 జీ స్పెక్ట్రంను పొందేందుకు స్వాన్ టెలికాంను రిలయన్స్ కమ్యూనికేషన్స్ వినియోగించుకుందని, ఇందుకు స్వాన్ టెలికాంకు 900 కోట్ల రూపాయలు అందించిందని సీబీఐ ఆరోపిస్తోంది. నిందితులుగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల పేర్లు చేర్చింది. కానీ, అనిల్, ఆయన భార్యను నిందితులుగా పేర్కొనలేదు. కేవలం వారిని సాక్షులుగా విచారించాలని సీబీఐ కోరడంతో.. కోర్టు అనుమతించింది.

  • Loading...

More Telugu News