: వెల్లివిరిసిన సమైక్యం.. తెలంగాణ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయికి పెళ్లి
సమైక్యం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు చేయాల్సిందే అని తెలంగాణ వాదులు పట్టుబడుతుండగా, రాష్ట్రం త్యాగధనుల ఫలమని, దాన్ని నాశనం కానీయబోమంటూ సమైక్యవాదులు ఉద్యమ బాటపడుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు తారస్థాయికి చేరుతున్న ప్రస్తుత తరుణంలో ఇరు ప్రాంతాల ప్రజలకు కనువిప్పు కలిగేలా తెలంగాణ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి ఒక్కటయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన గునిపూడి ఇర్మియా, ఖమ్మం జిల్లా విటి గూడేనికి చెందిన జ్యోతిల పెళ్లి ఆకివీడులోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సంప్రదాయబద్ధంగా జరిగింది. వీరి వివాహానికి హాజరైన సమైక్యాంధ్ర జేఏసీ నేతలు నూతన వస్త్రాలు అందజేసి అభినందించారు.