: ఆరంభమైన యాషెస్ చివరి టెస్టు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిటెస్టు ఓవల్ లో ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్లో 17 ఓవర్లు ముగిసేసరికి కంగారూలు వికెట్ నష్టానికి 50 పరుగులు చేశారు. 6 పరుగులే చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఇంగ్లిష్ సీమర్ జిమ్మీ ఆండర్సన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో, పర్యాటక జట్టు 11 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనర్ రోజర్స్ (10 బ్యాటింగ్), వాట్సన్ (30 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. కాగా, ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ ఈసరికే 3-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఇంగ్లండ్ పరం కాగా, మూడో టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగో టెస్టులో ఇంగ్లండే విజేతగా నిలిచి స్పష్టమైన ఆధిక్యంతో సిరీస్ విజయం నమోదు చేసింది.