: పాక్ జైళ్ల నుంచి మూడు రోజుల్లో భారత ఖైదీలకు స్వేచ్ఛ
దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మరో మూడు రోజుల్లో పెద్ద ఎత్తున భారత ఖైదీలు విడుదలవనున్నారు. మొత్తం 338 మంది ఖైదీలు శుక్రవారం విడుదలవుతారని పాక్ కు చెందిన లీగల్ ఎయిడ్ కార్యాలయం ప్రతినిధి నుంచి అధికారిక ప్రకటన వచ్చిందని భారత్-పాక్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న జతిన్ దేశాయ్ తెలిపారు. వారితో పాటు మరో ఎనిమిది మంది బాల నేరస్థులు కూడా రిలీజ్ అవుతున్నారు. విడుదలైన వారు శనివారం నాడు ప్రత్యేక బస్సులలో వాఘా-అటారీ సరిహద్దుకు చేరుకుని భారతదేశంలో ప్రవేశిస్తారని దేశాయ్ చెప్పారు. కరాచీలోని మాలిర్ జిల్లా జైల్లో ఉన్న 330 భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఇది సాధ్యమైందని ఆ దేశ ప్రకటనలో పేర్కొన్నారు.