: హైదరాబాదు రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ ఖాయం: మధుయాష్కీ


హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడటం ఖాయమని ఎంపీ మధుయాష్కీ ధీమా వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ సహా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని అంగీకరించేది లేదన్నారు. తండ్రి విగ్రహానికి పోలీసు పహారా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. రాజీవ్, ఇందిర విగ్రహాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. హైదరాబాదులో సమైక్యాంధ్ర సభ జరగనివ్వమన్నారు. కొడుకును సీఎం చేసేందుకే వైఎస్సీర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేస్తున్నారని యాష్కీ ఆరోపించారు.

హైదరాబాదు కోసమే సీమాంధ్రులు సమైక్య ఉద్యమం చేస్తున్నారన్నారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే సీమాంధ్ర వ్యాపారులు ప్రజలచేత ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. అణగారిన ప్రజల అభివృద్ధి కోసం సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆలోచించడం లేదన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇరు ప్రాంతాల ప్రజలు బాగుపడతారన్నారు.

  • Loading...

More Telugu News