: దిగ్విజయ్ తో భేటీ అయిన కేవీపీ


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై దిగ్విజయ్ తో కేవీపీ చర్చించినట్టు సమాచారం. సీమాంధ్ర అభ్యంతరాలను ఆంటోనీ కమిటీకి చెప్పాలని ఆయన సూచించారు. కాగా, ఢిల్లీలో దిగ్విజయ్ మాట్లాడుతూ, రాయల తెలంగాణ వంటి పలు సూచనలన్నింటినీ ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. అయితే నిర్ణయమేంటన్నది మాత్రం వేచిచూడాలని చెప్పారు. తమ పార్టీ తప్పేమీ లేదని, అన్ని పార్టీలు కోరినట్టే తాము తెలంగాణ ప్రకటించామని దిగ్విజయ్ అన్నారు.

  • Loading...

More Telugu News