: బాలయ్య వారిద్దరినీ పెళ్ళికి పిలవలేదా!?
తన రెండో కుమార్తె తేజస్విని వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపిస్తున్న నందమూరి బాలకృష్ణ ఈ మహోత్సవానికి తన అన్న హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ లను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి వారిద్దరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయింది. దీంతో, నందమూరి కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ పరిణయ సంబరానికి విచ్చేసిన నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించకపోయేసరికి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.