: రాఖీలు కట్టిన మహిళలకు వెంకయ్య వెరైటీ కానుక
బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు దేశ ఆర్ధిక పరిస్థితిపై వినూత్నంగా స్పందించారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన వెంకయ్య నాయుడు అక్కడ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆయనకు రాఖీలు కట్టారు. దాంతో, ఆయన వారికి ఉల్లిగడ్డలను బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. కాగా, దేశంలో పలుచోట్ల ఉల్లి ధరలు కిలో 80 రూపాయలు పలుకుతున్న సంగతి తెలిసిందే.