: ఫేస్ బుక్ పరిచయం.. అత్యాచారంతో ముగిసింది


ఫేస్ బుక్ పరిచయం మరో యువతి జీవితంలో విషాదాన్ని నింపింది. ఇద్దరి చేతిలో లైంగిక దాడికి గురైంది. రాజస్థాన్ లోని జైపూర్లో 27 ఏళ్ల యువతి బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది. ఆమెకు కోటకు చెందిన 30 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మనీష్ సైని పరిచయం అయ్యాడు. అది కాస్తా ఫోన్ల వరకూ.. తర్వాత కలుసుకునే వరకూ వెళ్లింది. ఓ రోజు మనీష్ పిలవడంతో ఆ యువతి కోటలో వాలిపోయింది. మనీష్, అతడి స్నేహితుడు సందీప్, ఆ యువతి ముగ్గురూ కలిసి మనీష్ నివాసంలో ఆల్కహాల్ పుచ్చుకుని, విందు చేసుకున్నారు. ఆ తర్వాత మనీష్, సందీప్ ఆమెపై అత్యాచారం చేశారు.

వేకువ జామున కోడి కూసింది. ఆ యువతి నిద్ర లేచి ఇక వెళతానంటూ బయల్దేరింది. మరో రోజు ఉండమని వారు అడిగారు. కుదరదని తెగేసి చెప్పింది. సందీప్ రైల్వే స్టేషన్ లో దిగబెడతానంటూ బండిపై యువతిని ఎక్కించుకుని రైలును కావాలనే మిస్ చేశాడు. యువతి నిలదీసింది. సందీప్ బండిపై నుంచి ఆమెను తోసేశాడు. గాయాలపాలు కావడంతో యువతి తప్పనిసరై పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. పోలీసులు మనీష్, అతని మిత్రుడికి సంకెళ్లు వేశారు. ఇంతకీ ఆ యువతి, మనీష్ కు 15 రోజుల క్రితమే పరిచయం అయింది. సోషల్ మీడియా అనుబంధాలు ఎలా సాగుతున్నాయనడానికి మచ్చుకు ఇదొక ఉదాహరణ.

  • Loading...

More Telugu News