: ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మె చేసుకోండి: హైకోర్టు
ఏపీ ఎన్జీవోలు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండగా రాజకీయ ఉద్యమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించింది. ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మెలో పాల్గొనాలని పేర్కొంది. ఏపీ ఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిటిషన్ పై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. విచారణకు సీమాంధ్ర సచివాలయం ఫోరం ప్రతినిధులు, ఏపీ ఏన్జీవోలు హాజరయ్యారు. సీమాంధ్ర ప్రాంతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు ఏర్పడుతున్న ఆటంకాలపై కోర్టు స్పందిస్తూ.. సమ్మె చట్ట విరుద్దమని మండిపడింది. ఉద్యమం వల్ల కౌన్సెలింగ్ కు ఆటంకాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించింది.
రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో విద్యార్ధులు ఏ కౌన్సెలింగ్ కేంద్రంలోనైనా హాజరుకావచ్చని కోర్టు సూచించింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను కోర్టు కూడా పర్యవేక్షిస్తుందని తెలిపింది. అనంతర విచారణను 28కి వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర విభజనకు సంబంధించి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.