: వచ్చే నెల 27న మన్మోహన్, ఒబామా భేటీ
ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి భేటీ కానున్నారు. వచ్చే నెల 27న వీరి సమావేశం వైట్ హౌస్ లో జరగనుంది. పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, రక్షణ సహకారం వంటి అంశాలు వీరిమధ్య చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించి భారత జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసన్ రైస్, ఆ దేశ రక్షణ మంత్రి చక్ హ్యాగెల్ తో సమావేశమై పర్యటన షెడ్యూల్ పై చర్చించారు. ఇదో స్వల్ప పర్యటన అని, అయితే మంచి పర్యటన కాగలదని మీనన్ అన్నారు.