: సమాచారం కావాలా.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి
ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలతో ముడిపడిన ఏదైనా సమాచారం కావాలనుకుంటున్నా.. అక్రమాలు, అవినీతి గుట్టుమట్లను బయటపెట్టాలనుకుంటున్నారా.. వీటన్నింటికీ ఉందిగా సమాచార హక్కు చట్టం. ఇన్నాళ్లూ ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే వారు. ఇకపై ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. rtionline.gov.in సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని కేంద్ర మంత్రి నారాయణస్వామి ఈ రోజు ప్రారంభించనున్నారు.