: ప్రాచీనులు సామాన్యులు కారు...


పురాతన మానవులు అమాయకులు అని మనం అనుకునేవాళ్లం. అయితే మనకన్నా ఎంతో తెలివైన వాళ్లని ఎప్పటికప్పుడు వారి కాలానికి సంబంధించిన పలు అంశాలు, వస్తువులు ఋజువు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పురాతన మానవులకు సంబంధించిన కొన్ని సమాధుల నుండి బయటపడ్డ వస్తువులు మళ్లీ ఆశ్యర్యానికి గురిచేశాయి. ఎందుకంటే అవి ఉల్కల నుండి సేకరించిన ఇనుముతో తయారుచేసినవి.

1911లో ఈజిప్టులోని ఎల్‌గెర్జ్‌ అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రెండు సమాధుల నుండి కొన్ని ఆభరణాలు, పూసలు బయటపడ్డాయి. వీటిని గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఇవి క్రీస్తుపూర్వం 3200 కాలం నాటికి చెందినవిగా తేలింది. అంతేకాదు ఈ అభరణాలు ఆకాశం నుండి నేలపైకి జారిపడిన ఉల్కాశకలాల నుండి సేకరించిన ఇనుముతో తయారు చేశారు. వీటిని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ ప్రిటీ మ్యూజియంలో భద్రపరిచారు.

  • Loading...

More Telugu News