: హైదరాబాద్ లో పేలుడు పదార్థాలు స్వాధీనం


హైదరాబాదులో నార్త్ జోన్ పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలగిరి దగ్గర్లో కారులో తరలిస్తున్న 3,500 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్టు నార్త్ జోన్ పోలీసులు తెలిపారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు వారు వెల్లడించారు. అయితే, ఆ జిలెటిన్ స్టిక్స్ ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? వీటి అక్రమ తరలింపు వెనుక సంఘ విద్రోహశక్తుల హస్తముందా? వంటి విషయాలన్నీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News