: రెండు వికెట్లు తీస్తే విజయం మనదే
దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో రస్టెన్ బర్గ్ లో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్ లో భారత్-ఎ గెలుపుదిశగా పయనిస్తోంది. 225 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు ఆటకు చివరిరోజు ఆటలో తాజా సమాచారం అందేసరికి 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 59 పరుగులు వెనకబడే ఉంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 9 వికెట్లకు 582 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్ లో 357 పరుగులకు ఆలౌటయ్యారు. కాగా, చివరిరోజు ఆటలో మరో 22 ఓవర్లు మిగిలుండగా త్వరితగతిన మరో 2 వికెట్లు తీస్తే భారత్ విజయం సాధించే అవకాశం ఉంది.