: పోలీసులకు రాఖీలు కట్టి వెనక్కి మళ్ళిన కవిత
హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే సౌధలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను గేటు బయటే ఆపి వేశారు. ఐడీ కార్డులున్న ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. దాంతో, మండిపడ్డ కవిత.. రాఖీ పండగ చేసుకునేందుకు వస్తే ఇలా చేయడం దారుణమన్నారు. అక్కడే పోలీసులకు రాఖీలు కట్టి వెళ్లిపోయారు.