: ఉగ్రవాది టుండాపై దాడి


లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ బయట దాడి జరిగింది. కస్టడీ నేటితో ముగియడంతో ఈరోజు అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వెనకగా వచ్చి అతనిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. దాంతో, టుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

  • Loading...

More Telugu News