: హాకీ క్రీడాకారిణిని వేధించిన ఈవ్ టీజర్లకు దేహశుద్ధి
మహిళలపై వేధింపులు ఆగడం లేదు. చట్టాలు చేసినా, చర్యలు తీసుకుంటున్నా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్ లో హాకీ క్రీడాకారిణిపై ఇద్దరు యువకులు వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. మన రాష్ట్రానికి చెందిన హాకీ క్రీడాకారిణి తండ్రితో కలిసి ముజాఫ్ నగర్ ఎస్ఎస్ పీ ఆఫీసుకు వెళ్తుండగా వికాస్(26), హరిఓం(25) అనే యువకులు ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. దీన్ని గమనించిన స్థానికులు వీరిద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుల్ని అరెస్టు చేశారు.