: 'ఆహార భద్రత' పథకాన్ని ప్రారంభించిన సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మానసపుత్రిక 'ఆహార భద్రత' పథకాన్ని ఢిల్లీ, హర్యానాలో ప్రారంభించారు. దాదాపు 80 కోట్ల పేద ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని సోనియా అన్నారు. ఇది రాజీవ్ గాంధీ కలల పథకమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. గర్భిణీ మహిళలు, యువతులు ఈ బిల్లు నుంచి ప్రయోజనం పొందుతారన్నారు. సరైన పోషకాహారం లభించక అనారోగ్యానికి గురవుతున్న చిన్న పిల్లలకు కూడా పథకం ఉపయోగపడుతుందన్నారు.