: మేనేజ్ మెంట్ కోటా సీట్లు ఆన్ లైన్లోనే భర్తీ చేయాలి: హైకోర్టు
ఎంసెట్ యాజమాన్య కోటా సీట్లను ఆన్ లైన్ లోనే భర్తీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల అర్హతలను పరిశీలించే హక్కు కాలేజీల యాజమాన్యాలకు కూడా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అర్హతలకు సంబంధించిన వివాదమేదైనా ఉంటే స్టేట్ కౌన్సిల్ తో చర్చించాలని ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలకు హైకోర్టు సూచించింది.