: మద్రాసు కేఫ్ సినిమా రాజీవ్ హత్య గురించి కాదు: జాన్ అబ్రహాం


శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన 'మద్రాస్ కేఫ్' సినిమా రాజీవ్ గాంధీ హత్య గురించి కాదని ఆ చిత్ర దర్శకుడు షుజిత్ సర్కార్, చిత్ర నిర్మాత, హీరో అయిన జాన్ అబ్రహాం తెలిపారు. ఢిల్లీలో వీరు మాట్లాడుతూ రాజీవ్ హత్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తమ సినిమాలో ఉన్నాయని, కానీ అవి పేపర్లలో వచ్చిన వాటి ఆధారంగా తీసినవేనని అంతకు మించి పరిశోధన చేసి తీసినవి కాదని షుజిత్ , జాన్ అబ్రహాం తెలిపారు. దీనిపై తమిళనాడుకు చెందిన పలు పార్టీల నేతలు.. సినిమాలో ఎల్టీటీఈ కార్యకర్తలను ఉగ్రవాదులుగా చూపారని మండిపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై ఏడేళ్లు వెచ్చించానని, ఆ సన్నివేశాలు కథకు కీలకమని షుజిత్ వాదిస్తున్నారు. జాతికి జరిగిన నష్టాన్నే తన సినిమాలో ప్రస్తావించాను తప్ప ఎవర్నీ కించపరచలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.

  • Loading...

More Telugu News