: ఆరోపణలు రుజువైతే ఏ శిక్షకైనా రెడీ: కేంద్ర మంత్రి జైస్వాల్


తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. 2004కు ముందున్న దస్త్రాలు గల్లంతయ్యాయని, కమిటీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. గల్లంతైన దస్త్రాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకున్నామని, సీబీఐకి అందజేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నట్టు స్పష్టం చేశారు. జైస్వాల్ ప్రకటనపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. బొగ్గుశాఖ దస్త్రాలు గల్లంతు కాలేదని కాంగ్రెస్ పార్టీ నేతలే కావాలని మాయం చేశారని అరుణ్ జైట్లీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News