: బొబ్బిలిలో రైలు ప్రమాదం
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ సమీపంలోని జీపీ వలస రైల్వే క్రాసింగ్ దగ్గర దుర్గ్ నుంచి విశాఖ వైపు వెళ్తున్న దుర్గ్ ప్యాసింజర్ రైలు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మహేష్, ఆటోలో ప్రయాణిస్తున్న సుధారాణి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రైలు 40 నిమిషాలుపాటు నిలిచిపోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.