: సీమాంధ్ర ఎమ్మెల్యేల కొత్త పార్టీ..!
రాయలసీమ, కోస్తాంధ్రాకు చెందిన ఎమ్మెల్యేలు త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయమని చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లపై పోటీ చేయబోమని ఆయన మీడియాకు చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే పార్టీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విభజన కాకుండా రక్షించడంలో తాము విఫలమయ్యామన్న శివారెడ్డి ప్రస్తుతం తామెలాంటి పదవుల్లో లేమన్నారు. టీడీపీ పార్టీ అధినేత పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేసి ప్రజల ఉద్యమంలో చేరి వారి అభిలాషకు అనుగుణంగా నిరసన తెలపాలన్నారు.