: క్రిస్టమస్ ఐలాండ్ లో మునిగిన పడవ... 150 మంది గల్లంతు


ఆస్ట్రేలియాకు తూర్పున ఉన్న క్రిస్టమస్ ఐలాండ్ లో ఓ పడవ మునిగిన ప్రమాదంలో 150 మంది గల్లంతయ్యారు. అయితే వీరిని రక్షించేందుకు నావికాదళం చర్యలు చేపట్టిందని, హెలికాప్టర్లు రంగలోకి దిగాయని ఆస్ట్రేలియా మారిటైం సేఫ్టీ అథారిటీ ప్రతినిధి మెల్ బోర్న్ లో వెల్లడించారు. దేశంలోని శరణార్ధుల కోసం సంక్షేమ చర్యలు చేపట్టినట్టు ఆస్ట్రేలియా గవర్నమెంటు ఇటీవల ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా పరిధిలో ఉన్న ద్వీపాలలో నిర్బంధంలో ఉన్న శరణార్థులంతా ఆస్ట్రేలియాకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News