: సీమాంధ్ర నినాదాలతో వాయిదాపడిన ఉభయసభలు


సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ టీడీపీ, కాంగ్రెస్ ఎంపీల నినాదాలతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో వారిని కాంగ్రెస్ ఎంపీలు అనుసరిస్తూ 'సీమాంధ్ర వర్థిల్లాలి' అంటూ నినాదాలతో సభను స్థంభింపచేశారు. దీంతో లోక్ సభ అర్థగంట, రాజ్యసభ 10 నిమిషాలు వాయిదాపడి తిరిగి ప్రారంభమయ్యాయి. బొగ్గు స్కాంపై వాడిగా వేడిగా చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు స్పీకర్ వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్ సభ మళ్లీ 12.00 వరకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News