: ముషారఫ్ పై నేరాభియోగం నమోదు
బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సహా ఏడుగురిపై పాక్ కోర్టు నేరాభియోగాన్ని మోపింది. తదుపరి విచారణను ఈనెల 27కు న్యాయస్థానం వాయిదా వేసింది. ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్ కొన్ని నెలల నుంచి తన నివాసంలోనే గృహ నిర్భంధంలో ఉంటున్న సంగతి తెలిసిందే.