: ఇలా కూడా బరువు తగ్గవచ్చు
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే మీరు బరువు పెరగడానికి నిద్ర లేమి కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు. చాలామందిని వేధించే సమస్యల్లో అధిక బరువు ఒకటి. అయితే ఇలా బరువు పెరడగడానికి కారణం రాత్రిపూట సరిగా నిద్ర లేకపోవడం కూడా ఒకటి కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన నిద్రా సమయంలో కొన్ని రకాలైన మార్పులను చేసుకోవడం వల్ల చక్కగా కంటినిండా నిద్రపోవచ్చని, దాని ఫలితంగా మనం బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కంటినిండా నిద్ర లేనప్పుడు దాని ప్రభావం వల్ల హార్మోన్లలో అసమతౌల్యం చోటుచేసుకుంటుంది. ఫలితంగా బరువు పెరగడం జరుగుతుంటుంది. అందుకే చక్కటి నిద్ర ద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా నిద్ర పోవడానికి ఏం చేయాలి? అంటే ముందుగా మన నిద్రా సమయంలో మార్పులు చేసుకోవాలి. వేళకాని వేళలో నిద్ర పోవడం కాకుండా నిర్ణీత వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే జంక్‌ఫుడ్‌కు దూరండా ఉండాలి. రోజూ నియమిత వ్యాయామం చేస్తుండాలి. వీటన్నింటితోబాటు రోజుకు 7 నుండి 8 గంటలపాటు నిద్రపోవడం కూడా చేయాలి. ఇలా చేస్తూ వస్తే కొద్దిరోజులకు మీ బరువు తప్పకుండా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.