: బాంబు పేలుళ్లు లష్కరే తోయిబా పనేనా?


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసానికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరున ఓ లేఖ వచ్చింది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు తమదే బాధ్యత అంటూ లష్కరే సంస్థ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ తదుపరి లక్ష్యం బేగం బజార్ అని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. 

మరోవైపు బెంగళూరు జైలులో ఉన్న12 మంది లష్కరే సభ్యులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రశ్నించనుంది. రెండు రోజుల క్రితమే వీరిపై ఎన్ ఐఎ ఛార్జిషీటు దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News