: ఎక్కువ భాషలు నేర్చుకునేవారే బెటర్‌


ఒకటికన్నా ఎక్కువ భాషలను నేర్చుకునే పిల్లలకు వర్కింగ్‌ మెమరీ ఎక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. సహజంగా మన పిల్లల్లో కొందరికి మెమరీ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు పిల్లల్లో మెమరీ పవర్‌ ఎక్కువగా ఉండడానికి భాషా పరిజ్ఞానం కూడా ఒక కారణమని తేల్చారు. పిల్లలు కొందరు ఒకటికన్నా ఎక్కువ భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి పిల్లల్లో వర్కింగ్‌ మెమరీ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

కెనడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక్క భాష తెలిసిన పిల్లలకన్నా రెండు భాషలు నేర్చుకున్న పిల్లల్లో వర్కింగ్‌ మెమరీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సమాచారాన్ని అతి తక్కువ సమయంలోనే మెదడులో భద్రపరచుకోవడం, విశ్లేషించడం, అవసరమైనప్పుడు వేగంగా దాన్ని ఉపయోగించడం వంటి సామర్థ్యాలనే వర్కింగ్‌ మెమరీ (క్రియాశీల జ్ఞాపకశక్తి) అంటారు. పిల్లల్లో 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసులో ఇది రూపుదిద్దుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా, యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. వీరు ఈ వయసు పిల్లలకు వివిధ రకాల పరీక్షలను నిర్వహించి వారి క్రియాశీల జ్ఞాపకశక్తిని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News