: మోడీకి దక్కేది రెండు ముస్లిం ఓట్లే: కాంగ్రెస్
పాతిక శాతం ముస్లింలు తమవైపే ఉన్నారని గుజరాత్ సీఎం, బీజేపీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఎన్నికలొస్తే ఆయనకు దక్కేది రెండు ఓట్లేనని ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్ మైనారిటీ నేత రషీద్ అల్వీ మీడియాతో మాట్లాడుతూ, మోడీ చెబుతున్నట్టు ముస్లింలు ఆయనపక్షాన ఉన్నారన్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. దేశం మొత్తమ్మీద మోడీకి దక్కేది రెండు ముస్లిం ఓట్లేనని, వాటిలో ఒకటి బీహార్ (షానవాజ్ హుస్సేన్) నుంచి, రెండోది అలహాబాద్ (ముక్తార్ నక్వీ) నుంచి అని అల్వీ వివరించారు. హుస్సేన్, నక్వీ ఇద్దరూ బీజేపీ నేతలన్న సంగతి తెలిసిందే.