: భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీయడం మంచిది కాదు : ప్రకాశ్ కారత్


ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న సంకుచిత భావనతో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం దేశాన్ని గందరగోళంలోకి నెట్టిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం దేశ సమైక్యతను దెబ్బతీస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో స్తబ్థుగా ఉన్న పలు డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయని మండిపడ్డారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీయడం మంచిదికాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఆమోదం తెలిపితే దేశంలో చాలా రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

యూపీఏ భాగస్వామ్య పక్షాలు, సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో చిన్న రాష్ట్రాల డిమాండ్లను నిద్ర లేపినట్టయిందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డిమాండ్లు ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో గూర్ఖాల్యాండ్, అసోంలో బోడోల్యాండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తరప్రదేశ్ లోని నాలుగు రాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News