: రాహుల్ గాంధీతో భేటీ కానున్న ఈశాన్య రాష్ట్రాల నేతలు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో సోమవారం భేటీ కానున్నారు. కొన్ని రోజుల కిందట జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్ గాంధీ మూడు రోజులపాటు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

శాసనసభ ఎన్నికల కారణంగా ఆ సమావేశానికి ఈశాన్య రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు దూరమయ్యారు. దీంతో రేపు ఉదయం వీరితో ప్రత్యేకంగా రాహుల్ భేటీ కానున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసే దిశగా రాహుల్ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News